పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా: వంటారి చంటిబాబు (32) దివ్యాంగుడు ఇంటి స్థలంకోసం ఐటిడిఏలో నిర్వహించిన స్పందనలో దరఖాస్తు సమర్పించాడు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటిడిఏ పి ఓ వి.అభిషేక్ ఫిర్యాదును స్వీకరించి నివాస స్థలం కేటాయించాలని పాడేరు తాహశీల్దార్ ని ఆదేశించారు. ఈ మేరకు తలారిసింగి గ్రామం లో ఒకటిన్నర సెంట్ల భూమికి కేటాయించి నివాస స్థలాన్ని గురువారం ఐటిడి ఏ పి ఓ అభిషేక్ ఆయన కార్యాలయంలో నివేశ స్థలం స్వాధీన దృవీకరణ పత్రాన్ని అందేజేసారు. ఐటిడిఏ నుండి రూ.20 వేల ఆర్దిక సహాయాన్ని మంజూరు చేసారు. ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాడేరు తాహశీల్దార్ వంజంగి త్రినాధ రావు, ఆర్ ఐ నల్లన్న తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]