in , ,

అప్రమత్తత, ఆలోచన, అవగాహన వల్లే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలం.*

  1. *సైబర్ నేరానికి గురైతే వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 కాల్ చేయండి.*

    *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.*

    రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రజల అప్రమత్తత, ఆలోచన, అవగాహన వల్లే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని జిల్లా ఎస్పీ  తెలిపారు.తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతోనే సైబర్ నేరాల్ల వలలో పడవద్దని,మొబైల్ ఫోన్ కి వచ్చే అనుమానిత సందేశాలు, లింకులు,సోషల్ మీడియా లో వచ్చే లింక్స్  నమ్మి ప్రజలు ఎవరు కూడా మోసపోవద్దని ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100,లకు తక్షణమే కాల్ చేయాలని సైబర్ నేరాల పట్ల ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు..

    *రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఈ వారం రోజులు వ్యవధిలో జరిగిన కొన్ని సైబర్ నేరాలు*

    ●రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ లో ఆన్లైన్ పార్ట్ టైం జాబ్  గూగుల్ మ్యాప్స్ రివ్యూస్ ఇవ్వడం ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చు అని నమ్మించారు. తర్వాత బిట్ కాయిన్ లో ట్రేడ్ చేయడం ద్వారా అధిక మొత్తంలో సంపాదించవచ్చు అని నమ్మించారు తద్వారా బాధితుడు అది నమ్మి 1,56,000/- రూపాయలు మోసపోయాడు.
    ●వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ రేపటితో ఎక్స్పైర్ అవుతుంది వెంటనే రీడింగ్ చేసుకోండి అని టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఒక లింక్ వచ్చింది. బాధితుడు ఆ లింకు ఓపెన్ చేసి తన ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు డీటెయిల్స్ , ఓటిపి ఎంటర్ చేశాడు. తద్వార 2,16,000/- రూపాయలు నష్టపోయాడు.
    ●ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నిరుద్యోగి బాధితుడు జాబ్ కోసం షైన్, నౌకరీ డాట్కామ్ లో రెస్యూమ్ అప్లోడ్ చేశాడు తర్వాత కొన్ని రోజులకు నౌకరీ డాట్కామ్ నుంచి ఎగ్జిక్యూటివ్ గా కాల్ వచ్చింది. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి 25/- లింకు ద్వారా పే చేయమని కోరాడు. బాధితుడు ఆ లింక్ లో తన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా 20,000/-  రూపాయలు నష్టపోయాడు.
    ●ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి అన్నోన్ నెంబర్ నుంచి దాని పర్సనల్ లోన్ ఎగ్జిక్యూటివ్ అని కాల్ వచ్చింది మీకు 10 లక్షల లోన్ అప్రూవల్ ఉంది అని నమ్మించాడు బాధితుల నుంచి లోన్ అప్రూవల్ కి ప్రాసెసింగ్, టాక్స్ అని పలు దఫాలుగా 85,000/-  రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు.
    ●ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి ఎన్నో నెంబర్ నుంచి కాల్ వచ్చింది మోసగాడు ఇండియన్ బుల్స్ పర్సనల్ లోన్ ఎగ్జిక్యూటివ్ గా పరిచయం చేసుకొని బాధితునికి రెండు లక్షల రూపాయల లోన్ అప్రూవల్ ఉంది అని నమ్మించాడు. లోన్ సాంక్షన్ అవ్వడానికి ప్రాసెసింగ్ అప్రూవల్  టాక్స్ రూపంలోపలు దఫాలుగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు తద్వారా బాధితుడు 40,000/- రూపాయలు నష్టపోయాడు.

    *తీసుకోవలసిన జాగ్రత్తలు:-*
    •మీకు లాటరి,లోన్ వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ?.. ఆశపడకండి, అనుమానించండి.వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి.
    •అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చెయ్యకండి, చేస్తే వాళ్ళు నగ్నంగా ఉండి, మీకు చేసిన వీడియో కాల్ రికార్డు చేసి,మిమ్మల్ని బెదిరించి డబ్బులు లాగేస్తారు.
    •వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా  ప్రకటనలను నమ్మకండి.
    •తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు. ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చెయ్యండి.
    •మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించండి.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Mahesh

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Post Views

చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనలు “

*తెలంగాణ బ‌హుజ‌న చైత‌న్యానికి చాక‌లి ఐల‌మ్మ ప్ర‌తీక*