తెలుగు దేశం పార్టీ అధినేత, ఎపి మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యిందని జగిత్యాల నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ మహంకాళి రాజన్న అన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద ఎపి సీఎం జగన్ మోహన్ రెడ్డిని దిష్టిబొమ్మ ను దహనం చేశారు. ఈ సందర్బంగా వారూ మాట్లాడుతూ దేశ చరిత్రలో ఇది ఒక దుర్థినం అని, ప్రజాస్వామ్యం కే నేడు బ్లాక్ డే గా అయన అభివర్ణించారు. అభివృద్ధి ప్రధాత, సంక్షేమనికి మారు పేరు అయిన చంద్రబాబు పై తప్పుడు కేసులు గర్హనీయం అన్నారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్ మదిలో పాలనా విధానం పక్కన పెట్టి ప్రతి పక్షం నేతలను జైల్లో పెట్టాలని కంకణం కట్టుకున్నారేమో అని ఏద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్ట్ జగన్ పతనానికి నాంది అని, ఈ దుచ్చర్యతో జగన్ తన గోతి తానే తవ్వుకున్నాడని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ ముమ్మాటికీ రాజకీయ కక్ష్యే అని, రాబోయే ఎన్నికల్లో జగన్ కు ఆంధ్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. బాబు అరెస్ట్ ను జగిత్యాల టిడిపి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజా క్షేత్రంలో బాబు అరెస్ట్ పై భేషరతుగా క్షమాపణ చెప్పాలని రాజన్న డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి భార్గవ్ రాం, సంబరి సంతోష్, కందుకూరి తిరుపతి, సామ నారాయణ రెడ్డి, గడ్డం భాస్కర్ రెడ్డి , మారం పెళ్ళి సాయిలు, నాయిని రాజేందర్ గౌడ్, బొల్లారపు రాజేశం, ఉప్పల రామ కిష్టయ్య, చెట్ పెల్లి రాజనర్సయ్య, ముంజల నరేష్ గౌడ్, కొండా శ్రీధర్, బత్తుల కొండయ్య, నక్క లక్ష్మణ్, ఆవుల రాయుడు, స్వర్గం వెంకటేష్, రమేష్, మగ్గిడి గంగాధర్, అఖిల్, జున్ను మల్లయ్య, అక్కిన పెల్లి కాశి నాథం, కోలుగురి ప్రసాద్ రావు తదితరులు ఉన్నారు.
[zombify_post]