in ,

సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ రెగ్యులరైజ్, వేతనాల పెంపుదలకే పోరాడుదాం

ఇల్లందులో జరగనున్న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి..

IFTU జిల్లా నాయకులు అమర్లపూడి శరత్       సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ కు కనీస వేతనాలు గానీ చట్టబద్ధ సౌకర్యాలని అమలు చేయడం లేదని అనేక సంవత్సరాలు తరబడి ఆందోళన చేసిన గాని సింగరేణి యాజమాన్యంగాని, ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిల్లా నాయకులు శరత్ అన్నారు. శనివారం స్థానిక కిష్టరం ఓపెన్ కాస్ట్ కాస్ట్ లో జరిగిన జనరల్ బాడీలో వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు హైపర్ కమిటీ వేతన ఒప్పందం జరిగిందని, దానిని సింగరేణి ఇంతవరకు అమలు చేయలేదని 11వ వేతన ఒప్పందాన్ని బొగ్గు పరిశ్రమలోని కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వర్తింప జేయాలని డిమాండ్ చేశారు. కనీసం 1వ కేటగిరి వేతనాన్ని అయినా అమలు పరచాలని అనేక సందర్భాలలో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు అనేక ఉద్యమాలు నిర్వహించిందని, ఢిల్లీ, నాగపూర్, కలకత్తా, హైదరాబాదు లాంటి నగరాల్లో వెజ్ బోర్డ్ సమావేశంలో జరుగుతున్న సమయంలో కూడా ధర్నాలు నిర్వహించి ఆందోళన కార్యక్రమం చేసిందని చెప్పారు. అయినప్పటికీ వెజ్ బోర్డ్ ఎప్పుడు కూడా కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్ పట్టించు కోలేదని, 9వ వేజ్ బోర్డులో కాంట్రాక్ట్ కార్మికుల కోసం జె బి సి సి ఐ, హై పవర్ కమిటీలో కాంట్రాక్ట్ కార్మికుల కోసం ఒప్పందం జరిగిందని అన్నారు. కానీ నేటికీ హైపర్ కమిటీ వేతన ఒప్పందాన్ని సింగరేణి యాజమాన్యం ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికునికి అమలు చేయలేదనీ అన్నారు. 11వ వేస్ట్ బోర్డ్ చర్చల ప్రారంభం నుంచి కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లు కూడా ప్రస్తావించాలని, వేతన ఒప్పందాన్ని వర్తింప చేయాలని కోరినప్పటికీ కాంట్రాక్ట్ కార్మికుల ప్రస్తావన లేకుండా తూతూ మంత్రంగా 11వ వెజ్ బోర్డును ముగించారని అన్నారు. సింగరేణి వెట్టి చాకరికి, శ్రమదోపిడికి గురవుతున్న కాంట్రాక్ట్ కార్మికులకు హైపర్ కమిటీ వేతనాలు ఒకటో కేటగిరి వేతనం, చట్టబద్ధంగా రావాల్సిన హక్కులను అమలు చేసే విధంగా సంఘాలు బాధ్యత వహించి అమలు చేయించాలని కోరారు. ఇల్లందులో జరగనున్న ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సదస్సులో సింగరేణి కాంటాక్ట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం, హైపోర్ యాక్టివ్ రాష్ట్ర కార్యదర్శి జి రామయ్య, తోకల రమేష్, ఏ వెంకన్న, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునీచ్చారు.

[zombify_post]

Report

What do you think?

నేటి నుంచి టెట్‌ హాల్‌టికెట్లు..ఈ నెల 15న పరీక్ష.

సైకో జగన్ మనసు మారాలి