వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తం ఉండాలని సత్యనారాయణపురం వైద్యాధికారినీ దివ్య నయన ప్రజలకు సూచించారు.వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో సత్యనారాయణపురం ప్రభుత్వ వైద్యశాల పరిధిలోని మారుమూల గ్రామాలైనా బట్టి గూడెం తదితర గ్రామాల్లో ఇంటింటి హెల్త్ సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ దివ్య నయన మాట్లాడితూ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు.రక్త పరీక్షలు నిర్వహించి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి మందులు అందజేశారు.ఈ కార్యక్రమంలో డి.పి.ఎం.ఓ సత్య నారాయణ,హెచ్ ఈఓ బాబురావు,హెల్త్ అసిస్టెంట్లు వేణు,విజయలక్ష్మి,ఆశా కార్యకర్త తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు

[zombify_post]