ఆదోనిలో టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఫీజు ఎక్కడ కంసమామ కార్యక్రమం చేపట్టారు.పట్టణంలోని బీమాస్ కూడలి నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో విద్యార్థులకు జగన్ మామయ్య మోసం చేశారంటూ, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు.ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ నాయకులు రామాంజనేయులు, సూర్య మాట్లాడుతూ… రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త నిబంధనాలు పెట్టి విద్యార్థులకు డబ్బులు వేయకుండా మేనమామ జగన్ మోసం చేస్తున్నారని పేర్కొన్నారు..రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, పథకాల నగదును విద్యార్థుల ఖాతాల్లోకి నగదును జమ చేయాలని డిమాండ్ చేశారు..
[zombify_post]