కొత్తగూడెం నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతు వాగు గ్రామపంచాయతీలో సరైన రహదారి సౌకర్యం లేక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జనసేన పార్టీ కొత్తగూడెం అసెంబ్లీ ఇన్చార్జ్ వేముల కార్తీక్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేముల కార్తీక్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో మౌలిక సౌకర్యాలు లేక ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారులు సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి పల్లి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు సందీప్, కృష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]