నర్సీపట్నంలో న్యాయవాదులు సోమవారం కోర్టు విధులను బహిష్కరించారు. బెజవాడ బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాది తరగం కృష్ణ బాబు పై వీరవారం పోలీసులు అక్రమంగా కేసులు బనాయించడంపై తాము విధులు బహిష్కరించినట్లు న్యాయవాదులు లోవరాజు, సూరిబాబు, గోవింద్ తెలిపారు. తక్షణమే పోలీసులు అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
[zombify_post]