కొవ్వూరు: గ్రామాలలో సంక్షేమ పథకాల కొరకు అర్హులైన వారు గ్రామ సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని… కొవ్వూరు ఆర్డీవో ఎస్ మల్లిబాబు అన్నారు. ఆర్డీవో కార్యాలయంలో స్పందనలో 13 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా ఇంటి స్థలం మంజూరు కొరకు దరఖాస్తులు రావడంతో ఆర్డీవో పై విధంగా స్పందించారు. వివిధ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను సత్వర పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు బదిలీ చేశారు. స్పందనలో డివిజన్ స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!