in ,

విధి నిర్వహణలో అసువులు బాసిన అమర వీరులకు నివాళి

** పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఘనంగా పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం

* అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీస్ అమర వీరుల సంస్మరణ వేడుకలు

** ముఖ్య అతిథిగా జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్ కృష్ణ

దేశ సార్వబౌమత్వాన్ని పరిరక్షించడం శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన వారి  సేవలు స్మరించుకుంటూ సమాజానికి ఒక సందేశం ఇచ్చే కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం ఎంతో సంతృప్తిని కలుగ చేసిందని, వారు చేస్తున్న బాధ్యతా యుతమైన సేవలు ప్రతి ఒక్కరూ స్మరించు కోవాలని జిల్లా ఇంచార్జి  మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ  పేర్కొన్నారు.

శనివారం ఉదయం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన పోలీస్ అమర వీరుల దినోత్సవం సందర్భంగా జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల కృష్ణ, ఎంపి భరత్ రామ్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎస్పీ పి. జగదీష్ తదితరులు ముఖ్య అతిథిగా హాజరై పోలీసు అమరవీరులు స్థూపానికి గౌరవ వందనం చేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ  సమాజ సేవలో విధులు నిర్వర్తిస్తూ  పోలీసులు అందించే సేవలు స్మరించు కోవడం ప్రతి ఒక్క పౌరుని కర్తవ్యం అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కు అంకితభావంతో పని చేస్తున్న ప్రతి ఒక్కరి సేవలను స్మరించు కోవాలని పేర్కొన్నారు. పోలీసులు విధి నిర్వహణలో చేసే బాధ్యతలు నిరంతరం సమాజ శాంతి భద్రతకు కృషి చేస్తారని, అదే సమయంలో సమాజం కూడా పోలీసుల పట్ల అంతే బాధ్యత కలిగి ఉండాలన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించి అసువులు బాసిన వారికి వారు చేసిన సేవలకు, త్యాగాలకు గుర్తింపుగా ఘనంగా నివాళులు అర్పించడం విధి నిర్వహణలో మన కర్తవ్యం అన్నారు.  విధి నిర్వహణలో మరణించిన పోలీసుల ఆత్మకు శాంతి, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్నా  అని జిల్లా ఇంఛార్జి మంత్రి పేర్కొన్నారు. ఈ సంస్మరణ సభలో పాల్గొనడం ఎంతో సంతృప్తిని కలుగ చేసిందని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా తొలి పోలీస్ అమర వీరుల దినోత్సవ ఇంత ఘనంగా నిర్వహించిన పోలీస్ అధికారులను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. విధి నిర్వహణలో విమర్శలు ఎదుర్కొన్నా ధైర్యం కోల్పోకుండా భాద్యతలు నిర్వహిస్తూ నిరంతర శాంతి భద్రతలను కొనసాగించడం జరుగుతోందని అన్నారు.  జిల్లాలో అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీస్ అమర వీరుల సంస్మరణ వేడుకలు నిర్వహించు కుంటున్నా మన్నా రు. వారి కుటుంబాల క్షేమం కంటే సమాజ సంక్షేమం కోసం వారు చేస్తున్న సేవలు సదా స్మరణీయం అన్నారు.

పార్లమెంటు సభ్యులు మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ, పోలీసు అమరవీరుల సంస్మరణ కోసం 1959 లో భారత దేశ సమగ్రత భద్రత ను కాపాడే దిశలో చైనా పై పోరాడిన తీరును ఆరోజు 10 మంది జవానుల  మృతిని స్మరించు కుంటు పోలీస్ అమరవీరుల దినోత్సవంగా జరుపు కుంటున్నామన్నారు.  విధుల నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ఈ సందర్భంగా నివాళులు అర్పింస్తున్నా మన్నారు. జీవితంలో ఒక్కసారైనా న్యూ ఢిల్లీ లోని పోలీస్ అమరవీరుల ప్రదర్శన ను తప్పని సరిగా చూడాలని పేర్కొన్నారు. విధుల్లో చేరే సమయంలో తీసుకునే ప్రమాణం అనుసరించి ఎంత పెద్ద వారైనా సరే చట్టం ముందు సమానం అనే విధంగా విధులను నిర్వర్తించాలని కోరారు.

శాసన సభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ, పోలీసులు నిరంతరం సమాజంలో శాంతి భద్రతలు నెలకొల్పడం లో వారి విధులు నిరుపమానం, ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అంతే భాధ్యత ను నిర్వర్తిస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా  సభ కార్యక్రమాన్ని జిల్లా పోలీసు అధికారులు  నిర్వహించగా, అదనపు ఎస్పీ ఎమ్. రజనీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా గత ఏడాది కాలంలో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను పేరు పేరునా స్మరించు కోవడం జరిగింది.

తొలుత ముఖ్య అతిథి  జిల్లా ఇంఛార్జి మంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.  ఆర్ ఐ పోలీస్ పెరేడ్ కమాండెంట్ గా ఆర్ ఐ  వ్యవహరించారు. అనంతరం సభా కార్యక్రమంలో భాగంగా పోలీసు అమర వీరుల స్థూపం వద్ద పుష్ప మాలను ఉంచి ఘనంగా నివాళులు అర్పించి, రెండు నిముషాలు మౌనం పాటించారు.

కార్యక్రమంలో భాగంగా ఇటీవల విధి నిర్వహణలో మృతి చెందిన జిల్లా కి చెందిన హెడ్ కానిస్టేబుల్ (బొమ్మురు పి ఎస్) పి. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు పోలీసులు తరపున ఆర్థిక సహాయం, శ్రీనివాస రావు సతీమణి దీప్తి కి ఉద్యోగ నియామక ఉత్తర్వులు మంత్రి తదితరుల చేతుల మీదుగా అందచేశారు.

ఈ సంస్మరణ సభలో జిల్లా ఎస్ పి పి. జగదీష్, అదనపు ఎస్పీ ఏం. రజనీ, అదనపు ఎస్పీ శ్రీనివాస రావు, మాజీ రుడా చైర్ పర్సన్ ఎమ్..షర్మిలా రెడ్డి , డీఎస్పీలు, సీ ఐ లు, ఎస్ ఐ లు, పోలీసు కానిస్టేబుల్స్, రిజర్వు పోలీసులు, హోం గార్డులు, పోలీసు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

పోలీస్ అమరవీరులకు శ్రద్దాంజలి ఘటించిన సీఎం జగన్

పేదప్రజలకు మెరుగైనవైద్యం అందచేయాలనే సంకల్పముతోజగనన్నఆరోగ్యసురక్ష