డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ముమ్మిడివరం నియోజకవర్గ భారత రిపబ్లికన్ పార్టీ మండల సమావేశం టీ కొత్తపల్లి గ్రామంలో జరిగింది. ఆదివారం సీతమ్మ చెరువు గ్రామంలో ఆర్ పి ఐ జిల్లా అధ్యక్షులు గిడ్డి జ్ఞాన ప్రకాష్ అధ్యక్షత వహించారు. భారత రిపబ్లికన్ పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేయడం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు జ్ఞాన ప్రకాష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులు బనాయించడం పట్ల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది.డి.పట్టా లంక భూములు ఉన్నది కోతకు గురైన ఎస్సీ ఎస్టీ రైతులకు ప్రభుత్వ భూమిని ఇప్పించాలని సమావేశం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం సొంత స్థలాల్లో గృహ నిర్మాణానికి ఐదు లక్షలు కేటాయించాలని, జగనన్న ఇల్లు కాలనీల్లో ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ప్రభుత్వం గృహాలు నిర్మించి ఇవ్వాలని సమావేశం డిమాండ్ చేసింది. అనంతరం ఈ సమావేశంలో ఐ. పోలవరం మండలం భారత రిపబ్లిక్ పార్టీ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షులుగా సీనియర్ పార్టీ నాయకుడు రేపు శ్రీనివాసరావుని ఏకగ్రీవం ఎందుకో ఒక, ఉపాధ్యక్షులుగా వెంటపెల్లి నాగేశ్వరావు, సెక్రటరీగా ఎలమంచిలి సురేష్ ని ఎన్నుకోవడం జరిగింది. కోశాధికారిగా నక్క దుర్గాప్రసాద్, మండల ఆర్ఎస్ఎఫ్ కన్వీనర్ గా సాధనలో శివకుమార్ ని ఎన్నుకోవడం సమావేశం ఎందుకొంది. ఆర్ పి ఐ పార్టీని బలోపేతం చేయడం కోసం గ్రామస్థాయిలో సభ్యత్వ నమోదు, జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున ఎమ్మెల్యే,ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షు జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి చీకిరిమిల్లి శ్రీనివాస్, పాము అంబెడ్కర్ నియోజకవర్గ కన్వీనర్ పంతగడి నరసింహమూర్తి, పండు కృష్ణమూర్తి,పంతగడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!