in ,

భద్రతా, భరోసా కల్పించడమే ప్రధాన లక్ష్యం – ఎస్పీ జగదీష్

ప్రజలకు భద్రత, భరోసా కల్పించడమే ప్రధాన లక్ష్యమని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి.జగదీష్‌ అన్నారు.విజిబుల్‌ పోలీసింగ్‌ను మరింత కట్టుదిట్టం చేసి, నేరాలు జరగకుండా కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ మేరకు జిల్లాలోని పోలీసు అధికారులకు  ఆయన ఆదేశాలు జారీ చేశారు. విజిబుల్‌ పోలీసింగ్‌ను మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాలను, పోలీసు వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. దీనిలో భాగంగా ముమ్మరంగా వాహనాల తనిఖీలు, రోడ్డు ప్రమాదాల నివారణకు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ఓపెన్‌ డ్రింకింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నామన్నారు.మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలందరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. శాంతి భద్రతల రక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

బి.ఎస్.పి పార్టీ ఆశవర్కర్లకు మద్దతు

రేపు చంద్రబాబు ను కలవనున్న లోకేష్