తప్పు చేయని మేం అందరం జైలుకు వెళ్లినా మాకు బాధలేదు… పార్టీని నడిపించే కార్యకర్తలు మాకున్నారు… వాళ్లే పార్టీని ముందుకు తీసుకెళతారు’ అని టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ అన్నారు.చంద్రబాబు అరెస్ట్ తమ కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. చంద్రబాబు, తాను, లోకేశ్, బ్రాహ్మణి నలుగురం నాలుగు దిక్కులుగా అయిపోయామని ఆవేదన వెలిబుచ్చారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా నేడు గాంధీ జయంతి వేళ నారా భువనేశ్వరి రాజమండ్రిలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం 5 గంటలకు ఆమె నిమ్మరసం తాగి దీక్ష విరమించారు.అనంతరం ఆమె ప్రసంగిస్తూ, “ఈ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ దీక్షలో నేను పాల్గొన్నది చంద్రబాబు కోసమో, మా కుటుంబం కోసమో కాదు. ప్రజల కోసం. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై ఎలుగెత్తడానికి ఈ దీక్షలో పాల్గొన్నాను. నాడు తెల్లదొరలపై పోరాడి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ వంటి మహనీయుడికి కూడా జైలు తప్పలేదు. ఆయన ఎంతో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ జైలు నుంచి బయటికి వచ్చాక ప్రజలతో కలిసి మళ్లీ పోరాడారు.ఎన్టీఆర్ నీతినిజాయతీ, క్రమశిక్షణే ప్రాతిపదికగా ముందుకెళ్లారు… ఆయన అడుగుజాడల్లోనే మేం నడుస్తున్నాం. ఇప్పటివరకు మా కుటుంబంపై ఒక్క ఆరోపణ లేదు, ఒక్క కేసు కూడా లేదు. మా పనేదో మేం చేసుకుంటూ వెళుతుంటాం. అందుకు కారణం ఎన్టీఆర్ నేర్పించిన క్రమశిక్షణే. నా తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు, నా భర్త ముఖ్యమంత్రిగా చేశారు… కానీ ఎప్పుడూ ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. చంద్రబాబును ఎప్పుడూ మేం ఆపలేదు. ఆయనకిష్టమైన ప్రజాసేవ చేసుకోమని ప్రోత్సహించాం. కానీ, ఇవాళ మేం తలో దిక్కుగా అయిపోయాం. మా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు.
This post was created with our nice and easy submission form. Create your post!