*పత్రిక ప్రకటన*
——————————————————
*•భవ్య శ్రీ అనే మహిళకు న్యాయం చేయాలనీ ఏబీవీపీ ఆధ్వర్యంలో కొవ్వాతుల నిరసన ర్యాలీ*
ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పాడేరు శాఖ ఆధ్వర్యంలో చిత్తూరు లో భవ్య శ్రీ అనే మహిళ పై జరిగిన అఘాత్యానికి నిరసనగా ఏబీవీపీ నగర కార్యదర్శి గిర్లియ నాగార్జున ఆధ్వర్యంలో ఈరోజు పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి పాత బస్టాండ్ వరకు కొవ్వాతుల నిరసన ర్యాలీ నిర్వహించడం ఈ సందర్బంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పూజారి ఉపేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల పై, అమ్మాయిల పై రోజుకొక అఘాయిత్యం జరుగుతున్న మహిళా కమిషన్ ఎక్కడికి పోయిందని ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా స్పందించని ఎమ్మెల్యే లు ఎంపి లు ఎక్కడికి పోయారని జగన్ మహిళలపై అఘాయిత్యాలు జరిగితే గన్ కంటే జగన్ ముందు వస్తాడు అని చెప్పి ఈరోజు జగన్ మామ ఎక్కడికి పోయాడని రాష్ట్రంలో మహిళలపై మరియు విద్యార్థినులపై జరుగుతున్న ఘటనలు అరికట్టడంలో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని ఇకనైనా మేల్కొని ఇటువంటి అఘాయిద్యాలు జరగకుండా చూడాలని బాధిత కుటుంబాలకు సరైన న్యాయం అందించాలని దిశ చట్టం తీసుకొని వచ్చి నా కూడా అత్యాచారాలు అగాయిత్యాలు ఆగడం లేదు చిత్తూరు జిల్లాలో భవ్య శ్రీ అనే అమ్మాయిని 4 రోజులు చిత్ర హింసలు పెట్టీ చంపి బావిలో వేసి నా కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు.ఇప్పటికైనా మొద్దు నిద్రలో ఉన్న జగన్ ప్రభుత్వం నిద్రలేచి న్యాయం చేకూరేలా చేయాలని ఎబివిపి డిమాండ్ చేస్తున్నది.మహిళా హోం మంత్రి తానేటి వనిత గారు ఓ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మహిళలపై, అమ్మాయిలపై జరుగుతున్న అఘైత్యాలు ఇంకా ఆగడం లేదు. ఇంతకీ హోం మంత్రి తానేటి వనిత గారు రాష్ట్రంలో ఉన్నారా లేదంటే రాష్ట్రం వదిలిపెట్టి వెళ్లిపోయారా అని ప్రశించారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి లేచి దుండగులను కఠినంగా శిక్షించి బహిరంగంగా ఉరితీయాలని ఎబివిపి డిమాండ్ చేస్తున్నది .న్యాయం చేయకపోతే ఎబివిపి ఊరుకోదని రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పాడేరు భాగ్ కన్వీనర్ సీదరి వంశీ కృష్ణ, చింతపల్లి భాగ్ కన్వీనర్ మోహన్, జిల్లా కార్యవర్గ సభ్యుడు పాటిబోయి సూర్యారావు,స్టూడెంట్ ఫర్ సేవ కన్వీనర్ భగ్రీయ మహేష్, నగర కార్యవర్గ సభ్యులు గిర్లియ బాబ్జి, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు రవి చంద్ర,జవహర్,రాజేంద్ర,తిరుపతి నవీన్ విద్యార్థులు పాల్గొన్నారు
ఇట్లు.
ఏబీవీపీ పాడేరు శాఖ
This post was created with our nice and easy submission form. Create your post!