విశాఖ. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పట్టేష్టంగా అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ కు విదసం ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది. సబ్ ప్లాన్ ద్వారా అమలు చేయాల్సిన ఎస్సీ ఎస్టీ ల ప్రత్యేక పధకాలు గత 4 ఏళ్లు గా నిలిచి పోయాయని సబ్ ప్లాన్ నిధుల తో వాటిని పునరుద్ధరించాలని వి ద సం ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ కి వినతి పత్రం అంద జేసారు. ఈమేరకు విశాఖ పర్యటన లో ఉన్న విక్టర్ ప్రసాద్ ను వి ద సం ఐక్యవేదిక నాయకులు ఈ రోజు సర్య్యూట్ హౌస్ లో కలిసి విజ్ఞప్తి చేశారు.అనంతరం వెంకట రావు మాట్లాడుతూ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు కార్పోరేషన్ ద్వారా 50 శాతం సబ్సిడీ తో రుణాలు, భూమి కొనుగోలు చేసి ఎస్సీ ఎస్టీ లకు పంపిణీ, ఉద్యోగార్ధం ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహణ, పరిశ్రమలు, ఆటో, కార్లు, షాపులు తో దళిత నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి సబ్సిడీ తో పెట్టుబడి కి మాత్రమే ఖర్చు చేయాలని, ప్రభుత్వం వాటన్నిటిని రద్దు చేసి కేవలం నవ రత్నాలకు మాత్రమే సబ్ ప్లాన్ నిధులు మళ్లించడం సబ్ ప్లాన్ స్ఫూర్తి కి విరుద్ధం అన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!