in , , ,

చంద్రబాబు ఏం తప్పు చేయలేదు-భువనేశ్వరి

టీడీపీ అధినేత చంద్రబాబు ఏ తప్పు చేయలేదని నమ్మి అంతా నిరసన తెలుపుతున్నారని నారా భువనేశ్వరి అన్నారు.చంద్రబాబు అక్రమ నిరసనగా బుధవారం  రాజానగరం నియోజకవర్గ పరిధిలోని సీతానగరం లో నారా భువనేశ్వరి  రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా భువనేశ్వరి  మాట్లాడుతూ.. చంద్రబాబును 19 రోజుల నుంచి జైలులో పెట్టారన్నారు. 45 సంవత్సరాల నుంచి ప్రజలు కోసం చంద్రబాబు కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా రెండు లక్షల మందికి చంద్రబాబు దారిచూపించారని తెలిపారు. పాడేరు ఏజెన్సీలో కూడా స్కిల్‌డెవలప్‌మెంట్‌లో వేలాది మంది శిక్షణ పొందారన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఏ తప్పు చేసినట్టు నిర్థారించలేకపోయారని అన్నారు.మహిళల అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తారని.. మహిళలంటే చంద్రబాబుకు నమ్మకమని చెప్పుకొచ్చారు. ఎప్పుడు బయటకు రాని మహిళలు చంద్రబాబు కోసం ఇప్పుడు రోడ్డుపైకి వస్తున్నారని భువనేశ్వరి అన్నారు.టీడీపీ కుటుంబ పెద్ద అయిన చంద్రబాబుని జైలులో పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు కోసం శాంతియుతంగా పనిచేస్తున్న మహిళలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. సృష్టికి మూలమైన మహిళలను అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని.. మైకులు పట్టుకుపోయినా పాదయాత్ర ఆగలేదని అన్నారు. మాజీ ఎంపీ తోట సీతామహలక్ష్మి ఆసుపత్రిలో ఉంటే హత్యానేరం కేసు పెట్టారన్నారు. పోలీసులు ఇష్టారాజ్యంగా పనిచేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ‘‘సేవ్ డెమెక్రసీ.. సేవ్ ఆంద్రప్రదేశ్.. సత్యమేవ జయతే అంటూ నారా భువనేశ్వరి నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు మరియు రాజానగరం బాధ్యులు శ్రీ బొడ్డు వెంకట రమణ చౌదరీ గారు మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

*గురి చూసి కొట్టారు

సుప్రీం లో చంద్రబాబు కు చుక్కెదురు!