టిడిపి అధినేత చంద్రబాబు ఎస్‌ఎల్‌పీపై విచారణలో ట్విస్ట్ చోటు చేసుకుంది..ముందుగా పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు బెంచ్‌లోని తెలుగు న్యాయ మూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి..విచారణకు విముఖత చూపించారు. సంజీవ్ ఖన్నా బెంచ్‌లో నాట్ బిఫోర్ మీ అన్నారు జస్టిస్ భట్టి. దీంతో మరో బెంచ్‌కు పిటిషన్‌ను బదిలీ చేశారు. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.అయితే ఈ విషయాన్ని సీజేఐ ధర్మాసనం ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు న్యాయవాది లూథ్రా. మరో ధర్మాసనం, లేదా సీజేఐ ధర్మాసనం ఇప్పుడే విచారించాలని కోరారు. దీంతో ఈ కేసు విచారణను ధర్మాసనం స్వీకరించింది.. ప్రస్తుతం చంద్రబాబు తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు.. రాజకీయ కక్షతోనే వరుస కేసులు పెడుతున్నారని విన్నవించారు.. గవర్నర్ ఆమోదం లేకుండానే అరెస్ట్ చేశారని, కనీసం విచారణ నోటీస్ ఇవ్వకుండానే జైలులో ఉంచారని తెలిపారు.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎకింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లు చెల్లవని లూద్రా తనవాదలను వినించారు.. సిఐడి తరుపు న్యాయవాది తన వాదనలు కొనసాగిస్తూ, ముందుగా ఈ స్కామ్ జిఎస్టీ గుర్తించిందని, ఆ తర్వాతే సిఐడి కేసు నమోదు చేసిందన్నారు.. ఈ కేసులో జివో ఒకరకంగాను, ఒప్పందం మరో రకంగా ఉందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.. ఇరువర్గాల వాదన విన్నధర్మాసనం ఈ కేసు విచారణను మరో బెంచ్ కు బదిలీ చేస్తూ,విచారణను అక్టోబర్ మూడో తేదికి వాయిదా వేసింది.
This post was created with our nice and easy submission form. Create your post!