చర్ల మండలం పద్మశాలి బజారు లోని నెలకొల్పినటువంటి వినాయక మండపం వద్ద, కమిటీ వారి యొక్క ఆహ్వానం మేరకు, ముఖ్య అతిథిలుగా సీఐ రాజగోపాల్, రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి రామాంజనేయులు, బిఆర్ఎస్ పార్టీ మండలం అధ్యక్షులు సోయం రాజారావు, మండలం ప్రధాన కార్యదర్శి లంక రాజు, చర్ల సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావ్, గణనాధునికి దర్శించుకొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణపతి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా, ప్రతి ఒక్కరు మహా గణనాధునికి నియమ నిష్టలతో ప్రత్యేక పూజలు చేసి గణనాథుని కృప పొందగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో బిసి సెల్ అధ్యక్షుడు దొడ్డి సూరిబాబు, మాజీ కార్యదర్శి బండి వేణు, తెగడ ఉప సర్పంచ్ శ్యామల శివ, చర్ల ఉప సర్పంచ్ శిరిపురపు శివ, సీనియర్ నాయకులు తడికల లాలయ్య, అజీజ్, తోటమల్ల రవి, కొంబత్తిని రాము, తడికల బుల్లేబ్బాయి, అంబోజి సతిష్, మరియు కమిటీ సభ్యులు స్థానికులు బొజ్జ తాతారావు, రౌతు నరసింహారావు, గోరింట్ల వెంకటేశ్వరవు, పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి పంజా రాజు తదితరులు పాల్గొన్నారు…
This post was created with our nice and easy submission form. Create your post!