పాడేరు, సెప్టెంబర్, 25: ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు సేవా పక్షోత్సవాలు సందర్భంగా పాడేరు బీజేపీ కార్యాలయంలో సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అసెంబ్లీ బీజేపీ ఆధ్వర్యంలోఅంత్యోదయ ప్రవచిత మహర్షి..అఖండ భారత స్వాప్నిక ఋషి..ఏకాత్మత మానవతావాద సిద్ధాంతకర్త..రాజకీయ విలువల్లో శిఖరాగ్రం..జాతీయవాద భావజాల అంతరాత్మ..శ్రీ పండిట్ దీన దయల్ ఉపాధ్యాయ గారి జయంతి నాడు వారికి ఘన నివాళులు అర్పించారు,ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మాట్లాడుతూ దేశంలో అట్టడుగు పేదలకు ప్రభుత్వ పథకాలు అందించడమే బీజేపీ కేంద్ర ప్రభుత్వ ద్యేయం అని రాష్ట్ర బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాడేరు అసెంబ్లీ కన్వీనర్ కుడా కృష్ణా రావు అన్నారు ,గిరిజన ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు కావడం శుభపరిణామం అని అన్నారు,రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు, ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు పెనుమాక రవికుమార్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సల్లా రామకృష్ణ ,యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మినుముల గోపాల పాత్రుడు ,విస్తారక్ పవన్, బీజేపీ ట్రెజరర్ ఆనంద్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు తాంగుల సత్యవతి , నాని బీజేపీ కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు .
This post was created with our nice and easy submission form. Create your post!