- రాష్ట్రంలో సంచలనంగా మారిన “స్కిల్ ” కేసులో సి ఐ డి అధికారులు పూర్తి ఆధారాలతోనే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను అరెస్ట్ చేశారని ,వారి వాదనను సమర్ధించే అటు ఎపి హై కోర్ట్ ,ఇటు ఏసీబీ కోర్ట్ న్యాయ మూర్తులు తీర్పులిచ్చారని వైస్సార్సీపీ నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి స్పష్టం చేశారు .ఆ కారణంగానే చంద్రబాబు రిమాండ్ ఖైదీ 7691 గా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు లో 15 రోజులుగా కొనసాగుతున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలో అత్యుత్తమ లాయర్లు సైతం చంద్రబాబును జైలు గోడలు మధ్యనుండి బయటకు తేలేకపోతున్న సంగతి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. గతంలో తమ నేత వై ఎస్ జగన్ ను అప్పటి కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి తప్పుడు కేసులతో 16 నెలలపాటు బెయిల్ కూడా రానివ్వకుండా ఇబ్బందులు పెట్టిన సంగతి టీడీపీ నేతలు మరిచినట్టుందన్నారు. నాడు జగన్ కుటుంబం రోడ్ ఫై బైఠాయిస్తే వికటాట్టహాసాలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు ఆ పరిస్థితి తమ నేత కుటుంబానికి వచ్చేసరికి చంద్రబాబు అరెస్ట్ అన్యాయమంటూ రోడ్ ఎక్కడం వింతగా ఉందన్నారు .ఇన్నాళ్లు జైలు రెడ్డి అంటూ కారు కూతలు కూసిన చంద్రబాబు ,లోకేష్ &కో ఇప్పుడేమని మాట్లాడతారన్నారు. తమ నేత వై ఎస్ జగన్ ఎప్పుడూ పైనున్న దేవుడు అంతా చూసుకుంటారని చెబుతారని ,ఇప్పుడు అదే నిజమైందని శ్రీహరి స్పష్టం చేశారు.ఇన్నాళ్లు తన అనుభవాన్ని రంగరించి వ్యవస్థలను మానేజ్ చేస్తూ సత్య హరిచంద్రుడిలా కలరింగ్ ఇచ్చిన చంద్రబాబు పాపం ఇన్నాళ్లకు పండిందన్నారు. తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతో ఇన్నాళ్లు కుప్పిగంతులేసిన నారా లోకేష్ హస్తినకు పలాయనం చిత్తగించి నోరు కూడా మెదపడం లేదన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు తన పాలనలో సాగించిన అనేక అకృత్యాలకు సంబంధించి అనేక కీలక అంశాలు వెలుగు చూడడం కాయమని శ్రీ హరి తెలిపారు .ఇప్పటికే అనేక కేసులలో కోర్టులలో దాఖలు కాబడిన పి టి వారేంట్లే ఇందుకు నిదర్శనమన్నారు.చంద్రబాబు ,నారా లోకేష్ లకు చిట్టా శుద్ధి ఉంటె తమపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు ,న్యాయస్థానాల విచారణకు సిద్దపడాలన్నారు. ఇక జైలులో చంద్రబాబుకు అధికారులు అసాధారణ భద్రత కల్పించినప్పటికీ పదే పదే జైలులో బాబుకి భద్రత లేదంటూ వ్యాఖ్యానిస్తూ ప్రజల్లో చంద్రబాబు అరెస్ట్ పట్ల సానుభూతి కోసం ఆయన కుటుంబం చేస్తున్న ప్రయత్నాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు .ఇక ఇన్నాళ్లు తెరవెనుక నుండి దత్త పుత్రుడి పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు అరెస్ట్ ప్రకటనతోనే సొంత పుత్రుడి కన్న ఆత్రంగా హైదరాబాద్ నుండి ఆదరాబాదరాగా పరామర్శకు పరుగులు తీయడం తో ఆ రెండు పార్టీల మధ్య ఎన్నాళ్లగానో ఉన్న తెరవెనుక బంధం బట్టబయలయ్యిందని శ్రీ హరి అన్నారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు జత కట్టి పోటీ చేసినా తమ అధినేత వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైస్సార్సీపీ సింహం మాదిరిగా సింగల్ గానే పోటీ చేస్తుందని అడపా స్పష్టం చేశారు.
This post was created with our nice and easy submission form. Create your post!
