అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం యు.చీడిపాలెం గిరిజన సంక్షేమ బాలు ర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి మృతికి నిర్లక్ష్యమే కారణమని తేలడంతో డిప్యూటీ వార్డెన్ మిరియాల రాజుబాబును కలెక్టర్ సుమిత్‌కుమార్ శుక్రవారం సస్పెండ్ చేశారు.హెచ్‌ఎం టి. నాగేశ్వరరావుకు షోకా జ్ నోటీసు ఇచ్చారు. వివరాలిలాఉన్నాయి. మండలంలోని యూ.చీడిపాలెం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్ర మ పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్న కిలో వంశీకృష్ణ (10)కు జ్వరం రావడంతో ఈనెల 11న అక్కడి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నిర్వహించిన వైద్య పరీక్షల్లో మలేరియా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. జ్వర తీవ్రత పెరగడంతో వైద్యాధికారి జయప్రకాష్ వై.రామవరం సీహెచ్‌సీకి తీసుకువెళ్లాలని సూచించారు. అయితే వార్డెన్ తీసుకువెళ్లలేదు. మరుసటిరోజు జ్వరం రావడంతో విద్యార్థిని మళ్లీ యూ.చీడిపాలెం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వై.రామవరం సీహెచ్‌సీకి ఎందుకు తీసుకువెళ్లలేదని వైద్యాధికారి ఆయనను మందలించారు. అయినా డిప్యూటీ వార్డెన్ రాజబాబు తీసుకువెళ్లలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈనెల 14వ తేదీన తెల్లవారుజామున మృతి చెందాడు. వెంటనే మృతదేహాన్ని స్వగ్రామంగొందికోటకు తీసుకువెళ్లడంతో తండ్రి రాజ్‌కుమార్ బోరున విలపించాడు. డిప్యూటీ వార్డెన్‌పై ఆయన ఆగ్రహానికి గురయ్యారు. ఆరోగ్యం విషమిస్తే తమకు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ఈ ఘటనపై నిర్వహించిన విచారణలో డిప్యూటీ వార్డెన్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని ఏటీడబ్ల్యూవో క్రాంతికుమార్ తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు నివేదించడంతో సస్పెండ్ చేశారని ఆయన వివరించారు. హెచ్‌ఎం టి. నాగేశ్వరరావుకు షోకాజ్ నోటీసు జారీ అయిందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి మృతిపై బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు వెళ్లింది
This post was created with our nice and easy submission form. Create your post!