డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట
పరిపాలన, గ్రామ అభివృద్ధి విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నమంటూ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కు మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచులు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ ప్రభుత్వం అవలంభించు కొన్ని పనులవలన ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన మేము మా గ్రామాలలో అభివృద్ధి పనులు చేయడానికి వెనకబడి ఉన్నామని వాపోయారు. గ్రామ పంచాయతీలకు గతంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి సబ్ ట్రెజరీ నుండి స్టాంప్ డ్యూటీ పన్ను, వినోదపు పన్నుమరియు ఇతర పన్నులు గ్రామపంచాయితీ ఖాతాకు జమ అయ్యేవి కానీ ఇప్పుడు అవి సక్రమంగా జరగడం లేదనన్నారు. రెవిన్యూ డిపార్టుమెంటు నుండి రావాల్సిన ల్యాండ్ సెస్ పన్నులు సక్రమంగా రావడం లేదని, రెవిన్యూ లెక్కలు సరిచేసి ల్యాండ్ పన్ను సొమ్మును గ్రామపంచాయతీలకు ఇప్పించాలని కోరారు. గ్రామ పంచాయతీ లకు జమ కావాల్సిన 14 మరియు 15 వ ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం జమ చేయకపోవడం అలాగే జమ చేసిన సొమ్మును వెనక్కి తిరిగి జరిగిందని పంచాయతీ సొమ్మును అరకొరగా కొద్దిగా రిలీజ్ చేయడం వలన గ్రామాలలో అభివృద్ధి పనులు చేయడానికి సాధ్యపడటం లేదు కావున 15 ఆర్థిక సంఘం సొమ్మును ఒకేసారి రిలీజ్ చేసే విధంగా చూడాలని గ్రామ పంచాయతీ లకు వివిధ శాఖల ద్వారా విడుదల కావాల్సిన నిధులు సక్రమంగా రాకపోతే మేము విధులు ఎలా నిర్వహించగలమని వాపోయారు. ఈ సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని జాయింట్ కలెక్టర్ను కోరారు.
[zombify_post]