డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో వాడపాలేం గ్రామానికి చెందిన చెత్త చెదారం అంత కూడా తెచ్చి పంచాయతీ వారు వాడపాలెం పెదపేట గ్రామానికి అతి దగ్గరగా నిత్యం జనసంచారం తో ఉండే రహదారి ప్రక్కన వెయ్యడం వలన పెదపేట గ్రామస్తులు పంచాయతీ వారికి చెప్పిన పట్టించుకోవడం లేకపోవడం మరియు ఆ డంపింగ్ యార్డ్ వలన అనేక వ్యాధులు రావడం వలన ఈ సమస్యపై స్పందన జగన్నన్నతో చెప్పుదం కార్యక్రమంలో భాగంగా కొత్తపేట మండల పరిధిలోని మండల ప్రజ పరిషత్ కార్యాలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన జాయింట్ కలెక్టర్ కు వాడపాలెం పెదపేట కు చెందిన పెద్దలు గ్రామస్తులు యూత్ అందరూ కలిసి అధికారులకు వినతి పత్రం సమర్పించారు.ఈ వినతి పత్రంలో ఇలా వుంది …
డా॥ బి.ఆర్.అంబేధ్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలం, వాడపాలెం -పెదపేట గ్రామస్తులు యావన్మంది కలసి వ్రాయించి సమర్పించుకొన్న విన్నపములు.వాడపాలెం గ్రామపంచాయితీ వారు వాడపాలెం – పెదపేట గ్రామము నందు డంపింగ్ యార్డు పెట్టి అందు గ్రామములోని చెత్తా చెదారమును అక్కడ వేయుచున్నారు.కాని మేము అందరము అక్కడ మా పిల్లాపాపలతో నివాసము వుంటూవున్నాము. గ్రామపంచాయితీ వారు అక్కడ చెత్తావేయటవలన దోమలు, క్రిమికిటకములు వచ్చుచున్నవి. అంతేకాక కలరా వంటి విష జ్వరములు,అంటువ్యాధులు ప్రభలు చున్నవి. ఈ వర్షకాలంలో సదరు చెత్తాచెదారము వర్షమునకు తడిసి కుళ్ళు వాసన వచ్చి మేము అక్కడ నివాసము వుండుటకు చాలా దర్భరముగా వుంటూవున్నది.సదరు వ్యవహారముల వలన పిల్లలు, వృద్ధులు అనేక వ్యాధుల భారిన పడుచున్నారు. కావున ఏలినవారు మా దయనీయ పరిస్థితిని గమనించి సదరు డంపింగ్ యార్డును అక్కడ నుండి తొలగించి వేరే ప్రదేశము నందు ఏర్పాటు చేయవలసినదిగానూ, మాకు న్యాయం చేయవలసినదిగా కోరిప్రార్ధించుచున్నాము అని ఆ వినతి పాత్రని అధికారులకు సమర్పించారు.అధికారులు స్పందించి డంపింగ్ యార్డు ను తొలగించి మా కష్టాలను విదిపించలని కోరుకుంటున్నట్లు
తెలిపారు.
[zombify_post]