టిడిపి కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు అద్యక్షతన సమావేశమైన ఆ పార్టీ, వైసిపికి స్క్రీన్ ప్రంజెంటేషన్ అవకాశం ఇస్తే సిఎం జగన్ అక్రమాస్తులపై స్క్రీన్ ప్రజెంటేషన్ ఇవ్వాలని పట్టుబట్టాలని టిడిపి ఎంఎల్‌ఎలు నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. శాసన సభలో అవకాశం ఇవ్వకపోతే సిఎం జగన్ అవినీతి బాగోతాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని టిడిపి నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో చంద్రబాబు అరెస్ట్ పై స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే నిరసనలు తెలియజేయాలని లోకేష్ సూచించారు. టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాతి పరిణామాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.