ఏనుగుల గుంపులో ఒంటరి ఏనుగు కలిసిందని, మొత్తం ఏనుగుల గుంపు కొమరాడ మండలం దుగ్గి ముంపు ప్రాంతం వద్ద ఉన్నాయని జిల్లా అటవీ అధికారి జి. ఎ. పి ప్రసూన తెలిపారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఏనుగుల సంచారంపై అటవీశాఖ ఆయా ప్రాంతాల ప్రజలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తం చేసిందన్నారు. ముఖ్యంగా పాతదుగ్గి, కళ్ళికోట, సీమనాయుడు వలస, దలైపేట, బిట్రపాడు గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.
[zombify_post]