డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
నాడు దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వై.యస్.రాజశేఖర రెడ్డి పేదల వికాసానికి పెద్దపీట వేస్తే నేడు ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం ఆలోచన చేస్తున్నారని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.

రావులపాలెం నక్షత్ర స్కూల్ ఎదురుగా 55 కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్తపేట, రావులపాలెం మండలాల ప్రజలకు గోదావరి నీటిని తాగునీరుగా అందించే ప్రాజెక్టును ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డా.వై.యస్.రాజశేఖర రెడ్డి హయాంలో గోదావరి నీటిని తాగునీరుగా మార్చి ప్రజలకు అందించే విశేషమైన ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయని నాడు బొబ్బర్లంక వద్ద ఒక ప్రాజెక్ట్ నిర్మించి ఆత్రేయపురం మండలానికి గోదావరి నీటిని తాగునీరు అందించేవారని తదుపరి రావులపాలెం వద్ద మరొక ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసి రావులపాలెం, కొత్తపేట మండలాలకు గోదావరి నీటిని తాగునీరుగా అందించే పనులకు అడుగులు పడగా నేడు ఆ పని సాకారం అయింది అని అన్నారు.
తదుపరి 1800 కోట్ల రూపాయలతో మొత్తం కోనసీమ జిల్లాకు తాగునీరు అందించే ప్రాజెక్ట్ నిర్మాణం కోసం స్థలం ఆత్రేయపురం మండలంలో స్థలపరిశీలన, సర్వే మరియు డిజైన్ రూపకల్పన పనులు జరుగుతున్నాయని అతి త్వరలోనే కోనసీమ జిల్లా అంతటా గోదావరి నీరు తాగునీరుగా అందిస్తారని అన్నారు.
నీటి ద్వారానే అనేకరకాల అంటువ్యాధులు ప్రభాలుతున్నాయని అలాంటి సమస్యలు తలెత్తకుండా నీటిని అధికారుల పర్యవేక్షణలో శుద్దిచేసి ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా రావులపాలెంలోని గోదావరి నీటి శుద్ధి ప్లాంట్ మొత్తాన్ని చిర్ల పరిశీలించారు.
[zombify_post]