in ,

రైవాడ కెనాల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి…జెడ్పీటీసీ అనురాధ

కోటపాడు, అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్,20.
దేవరాపల్లి నుండి నరవ వరకు సుమారు 60 కిలోమీటర్లు ఓపెన్ రైవాడ కెనాల్ పై పనిచేస్తున్న 136 మంది ఔట్సోర్సింగ్ కార్మికులకు 15,000 జీతం నుండి 18,500 రూపాయల వరకు జీతం పెంచుట గురించి అదే విధంగా ప్రతినిత్యం రోజుకు సుమారు 6 గంటలు నీటిలో నాచు తీసే పనిచేచేస్తున్నారు, తద్వారా కార్మికులు చర్మ వ్యాధుల అనారోగ్యానికి గురవుతున్నారనీ, వీటన్నింటినీ దృష్టిలోపెట్టుకుని హెల్త్ ఎలవెన్స్ మంజూరు చేయమని జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకటకుమారిని అరిలోవ క్యాంప్ కార్యాలయంలో కె.కోటపాడు జెడ్పీటీసీ అనురాధ సమక్షంలో కలిసి వినతి పత్రం అందజేయడం జరిగినది. ఈ సమస్యపై మేయర్ సానుకూలంగా స్పందిస్తూ జీతాలు పెరుగుదల విషయమై సంబంధిత అధికారులతో ఫైల్ రప్పించి, కౌన్సిల్ లో ఆమోదం చేయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే హెల్త్ అలవెన్స్ అనేది ప్రభుత్వ నిర్ణయం అని కార్మికులకు తెలియజేశారు. అమె వెంట పలువురు నాయకులు, యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆర్.సత్యం, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

రేపు తేలనున్న చంద్రబాబు కస్టడీ తీర్పు

తెలంగాణలో టీచర్స్ రిక్రూట్ మెంట్