అనకాపల్లి. 5వందల జనాభా కల్గిన ప్రతి దళిత వాడను ప్రత్యేక పంచాయితీ గా చేసి అభివృద్ధి కి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని అంబేద్కర్ ఇండియా మిషన వ్యవస్థాపకులు,స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డీజీపీ పి.వి సునీల్ కుమార్ అన్నారు. ఈ మేరకు అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న శ్రీలక్ష్మి కల్యాణ మండపంలో ఏయిమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో అయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.మొదటగా ఆయన భీమునిగుమ్మం వద్ద ఉన్న డా. బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పంచారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అశయ సాధన కోసం ప్రతి దళిత ఉద్యోగి పాటుపడాలని కోరారు. ప్రత్యేక దళిత పంచాయితీల ఏర్పాటు ద్వారా ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు.ప్రతి ఏటా రూ 1600 నుండి 2000కోట్లు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మంజూరు అవుతాయని, వాటిని వినియోగించు కోవడంలో దళితులు దృష్టి పెట్టాలని, మనము అభివృద్ధి చెందేలా మనం మారాలని, హక్కులు పొందడంలో పట్టు సాధించాలని విద్యావంతులు అయిన దళితులు వ్యాపారాలు చేయడనికి అంబేద్కర్ గ్యారంటీ పథకంతో వడ్డీ లేని రుణాలు 3 కోట్లు వరకు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏయిమ్ జిల్లా పరిశీలకులు టి టి అప్పారావు, జిల్లా ప్రెసిడెంట్ దేముడు, కన్వీనర్ పి శివ, సెక్రటరీ జీ.అప్పారావు, వైస్ ప్రెసిడెంట్ బోగేశ్, కో కన్వీనర్లు సాల్మాన్ రాజు,సరమండ వీరబాబు, రావాడ ప్రకాష్, రాజు,శేకర్ మరియు బారి స్థాయిలో ఉద్యోగులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!