ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చిందని సిద్ధిపేట భారత జాగృతి అధ్యక్షులు పర్వతనేని శ్రీధర్ రావు అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ నివాసంలో ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు..అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాతీయస్థాయిలో పోరాటం చేశారని , అన్ని రాజకీయ పక్షాలను కలిసి బిల్లుకు మద్దతు కూడగట్టిందన్నారు. మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష నిర్వహించిన ఘనత కవితకు దక్కింది అన్నారు. ఆమె పోరాట ఫలితంగానే కేంద్రంలో కదలిక వచ్చిందని చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల వల్ల వారికి తగిన గౌరవం, గుర్తింపు లభిస్తుందన్నారు.
[zombify_post]