అంగన్వాడీ టీచర్ల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించక పోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాలస్వామి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా చలో కలెక్టరేట్లో పిలుపులో భాగంగా బుధవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందుభారీ ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ముట్టడిలో పోలీసులకి యూనియన్ నాయకులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. బారి గేట్లను గెంటేసి కలెక్టరేట్లకు చచ్చుకొని పోవడానికి అంగన్ వాడిలు, ఆయాలు ప్రయత్నం చేశారు. అనంతరం సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి పాల్గొని మాట్లాడుతూ… అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వానికి అనేకమార్లు విన్నవించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు టీచర్స్ అని ముద్దు పేరు పెట్టారే తప్ప పే స్కేలు, ఉద్యోగ భద్రత, తదితర అంశాలను విస్మరించారని తెలిపారు. కేవలం టీచర్ అనే తోక తలిగించి అంగన్వాడి టీచర్లతో అనేక పనులు చేసుకుంటూ వెట్టిచాకిరి గురి చేస్తున్నారని మండి పడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, గ్రాట్యుటీ ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాల్సింది పోగా కేవలం 13650/- రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అని అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ ని టీచర్స్ కి 10 లక్షలు ఆయా కి 5 లక్షలు ఇవ్వాలని అడిగితే కంటితుడుపు చర్యలు చేపట్టారని అన్నారు.8 సం,టీఏడీఏలను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.ప్రమాద భీమా ఇవ్వమని అడిగితే ఛస్తే దహన ఖర్చులకు పైసలు ఇస్తామని దుర్మార్గంగా సర్కులర్ ఇచ్చారని ఆవేదన ప్ చేశారు.అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె చేస్తుంటే అధికారులు కేంద్రాల తాళాలు పగులగొట్టడం దూర్మార్గమని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగివచ్చి సమస్యల ను పరిష్కరించకుంటే అంగన్వాడీ కార్మికుల సహనాన్ని పరిక్షిస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతి ఈ ప్రభుత్వానికి పసుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలోసిఐటియు జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య ,జిల్లా ఉపాధ్యక్షురాలు దాసరి కళావతి, జిల్లా కోశాధికారిజి భాస్కర్,జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, ఇప్పకాయల శోభ, అంగన్వాడి టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం పద్మ, జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి, యూనియన్ జిల్లా కోశాధికారి పి పద్మ,యూనియన్ నాయకులు కళావతి, లక్ష్మి, శారద, అనిత మాధవి వసంత శ్యామల వీణ సురేఖ రామ భూలక్ష్మి నాగరాణి విజయ మంజుల వివిధ సెంటర్లకు చెందిన టీచర్ ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
[zombify_post]