-
నేడు టెట్ ప్రాథమిక కీ విడుదల..!
-
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైందన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష కూడా విజయవంతగా నిర్వహించారు. టెట్ పరీక్షకు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైందన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష(TET Exam) కూడా విజయవంతగా నిర్వహించారు. టెట్ పరీక్షకు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,052 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో పేపర్-1కు 2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా వారికోసం 1,139 పరీక్షా కేంద్రాలు.. పేపర్-2కు 2,08,498 మంది దరఖాస్తు చేసుకున్నారు .వీరి కోసం 913 పరీక్షా కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరిగింది.
మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 రాతపరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు 2 లక్షల 50 వేల మందికి పైగా హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోనూ నిర్వహించారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం 2,052 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2,052 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 22,572 మంది ఇన్విజిలేటర్లు, 10,260 మంది హాల్ సూపరింటెండెంట్లను నియమించారు. జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇదిలా ఉండగా.. నేడు దీనికి సంబంధించి కీ విడుదల చేయనున్నారు. నేటి నుంచే డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే సెప్టెంబర్ 27వ తేదీన టెట్ ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో ఓఎంఆర్ పత్రాల స్కానింగ్ శరవేగంగా జరుగుతోంది. నేడు ప్రాథమిక కీ విడుదల చేసి.. సెప్టెంబర్ 27న ఫైనల్ కీతో పాటు.. ఫలితాలు కూడా విడుదల చేస్తారు. వీటితో పాటు.. అభ్యర్థుల యొక్క ఓఎంఆర్ పత్రాలను కూడా అందుబాటులో ఉంచనున్నారు.
[zombify_post]