టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. రెండు రోజుల తర్వాత తీర్పును ప్రకటిస్తామని తెలిపింది. ఉదయం నుంచే హైకోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాడివేడి వాదనలు జరిగాయి.చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా.. సీనియర్ లాయర్ సిద్ధార్థ్ అగర్వాల్, లండన్ నుంచి వర్చువల్‌గా హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. సీఐడీ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి.. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున అడ్వకేట్ రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు.
చంద్రబాబు తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబును అరెస్ట్ చేసే సమయానికి ఆయన పేరు ఎఫ్ఐఆర్లో కూడా లేదన్నారు. ఈ సందర్భంగా స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ తేజ్మాల్ చౌదరి, అర్ణబ్ గోస్వామి కేసులను ప్రస్తావించారు. ఎన్నికల దృష్ట్యా దురుద్దేశంతోనే చంద్రబాబుపై కేసు నమోదుచేశారన్నారు. సెక్షన్ 17ఏ కింద అరెస్టుకు గవర్నర్ నుంచి అనుమతులు తీసుకోలేదని వాదించారు. 2020లో నమోదైనఎఫ్ఐఆర్లో చంద్రబాబు ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి అరెస్టు విషయంలో సీఐడీ ప్రొసీజర్ పాటించలేదని పేర్కొన్నారు.
చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరుపై అభ్యంతరాలున్నాయని మరో సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. FIR 2018 సవరణ కంటే ముందు నమోదై ఉంటే బెయిల్ అడిగేవాళ్లం కాదని.. FIR 2020లో నమోదైంది కాబట్టి అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అవినీతి నిరోధక చట్టం క్రింద ప్రజాప్రతినిధిపై కేసు నమోదు చేసే సమయంలో గవర్నర్ అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు. 2020లో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసినప్పుడు ఇలాగే జరిగిందన్నారు. అలాగే కర్ణాటక కేసును ఉదహరించిన లూథ్రా, 17Aలో ముందస్తు అనుమతి అవసరమని వాదనలు వినిపించారు.ఇక సీఐడీ తరపున వాదించిన ముకుల్ రోహిత్గీ.. ణపతి వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడుతో పాటు చంబునాథ్ మిశ్రా కేసులో తీర్పుల్ని వివరించారు. అన్ని సాక్ష్యాధారాలతోనే చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. ఈ దశలో బెయిల్ ఉత్తర్వులు ఇవ్వడం సమంజసం కాదని వాదించారు. ఎఫ్ఐఆర్ ఏమి ఎన్సైక్లోపిడియా కాదని.. స్కిల్ స్కాం ఒప్పందానికి కేబినెట్ ఆమోదం లేదని పేర్కొన్నారు. సెక్షన్ 139 ప్రకారం ఎన్ని ఛార్జ్షీట్లైనా వేయవచ్చని.. ఎఫ్ఐఆర్లో ఎంత మంది పేర్లను అయినా చేర్చవచ్చని పేర్కొన్నారు.
[zombify_post]
