in , , , ,

ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాస్తారోకో…

  • పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాస్తారోకో..

  • కొత్తపల్లి శివకుమార్ CPI ( M L) ప్రజా పంథా జిల్లా కార్యదర్శి

నిలువ నీడలేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నేరేడుచర్ల చౌరస్తాలో సోమవారం ప్రజాపంథా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుండి పేదలు గుడిసెలేసి నివాస స్థలం కోసం పోరాడుతుంటే ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ రెవెన్యూ వారు పోలీసు వారు అక్రమ కేసులు బనాయిస్తూ  పేద మహిళలను జైలుకు పంపి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేేదన వ్యక్తంచేశారు. 

నివాస హక్కుకల్పించవలసిన ప్రభుత్వం కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తుంటే వాళ్ళ హక్కులను కాపాడుకునేందుకు ఇళ్ల స్థలాలు సాధించుకునేందుకు అనేక రూపాల్లో పోరాటాలు చేసి  జిల్లా కలెక్టర్  కు స్థానిక ఎమ్మెల్యే కు ఎమ్మార్వో కు అనేకమార్లు వినతి పత్రాలు ఇస్తున్న పట్టించుకోవట్లేదని అన్నారు . గత నెల లో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ని కలిసి వినతి పత్రం ఇస్తే త్వరలోనే ఎంక్వయిరీ పెట్టి పేదలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.. కానీ నేటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. అందుకే పేదలతో కలిసి ప్రజాపంథా ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నేరేడుచర్ల చౌరస్తాలో రాస్తారోకో చేయడం జరిగింని తెలిపారు. ఈ రాస్తారోకోను పోలీసులు భగ్నం చేసి నాయకులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

 ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పోరాడుతున్న వాళ్లను అక్రమ అరెస్టులు చేయడం ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక పిడిఎస్యు  జిల్లా కార్యదర్శి ఎర్ర అఖిల్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగన్న, పార్టీ నాయకులు పళ్లన్న పావని, హుస్సేన్, కరుణాకర్, మరియమ్మ సత్యక్క ఆటో యూనియన్ జిల్లా కరీంనగర్ గోగుల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

బాబు తోనే మేము : ఎస్సీ సెల్

క్రిస్టియన్స్ మ్యారేజ్ సర్టిఫికెట్లు కలిగి ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి : సామాజిక కార్యకర్త