డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును, ఈ జగన్ ప్రభుత్వం అక్రమంగా చంద్రబాబు ని జైలుకు పంపడాన్ని నిరసిస్తూ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు, కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జీ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో 7వరోజు నిరాహార దీక్షలో భాగంగా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలోని కొత్తపేట నియోజకవర్గంలోని దళిత సోదరులందరూ ఏడవ రోజు రావులపాలెంలో రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. ఈ దీక్షకు అనేక దళిత సోదరులు పాల్గొనడం జరిగింది.

ఈకార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులు, టీడీపీ నాయకులతో పాటు, రాష్ట్ర కార్యదర్శి మరియు కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు పాల్గొన్నారు.
[zombify_post]