in

Nalgonda | గుర్తు తెలియని వాహనం ఢీ.. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన దంపతులు మృతి | Vidhaatha


Nalgonda

  • మృతులకు ఇద్దరు సంతానం

విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: జిల్లా పాన‌గల్‌లో విషాదం చోటుచేసుకుంది. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన దంపతులు మృత్యువాతపడ్డారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని దంపతులు స్పాట్‌లోనే మృతి చెందారు. పానగల్లు ఉదయ సముద్రం ప్రాజెక్టు దిగువన దంపతులు ఓర్సు విష్ణు, స్వప్న ఈరోజు ఉదయం మాదిరే మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లారు.

అయితే తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వాహనము వెనుక నుంచి బలంగా దంపతులను ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన దంపతులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లులు ఉండగా.. విష్ణు ఎన్జీ కాలేజీలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పని చేస్తున్నాడు.

ఒకే ప్రమాదంలో దంపతులు మృతి చెదంటంతో వారి పిల్లలు అనాథలయ్యారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.


Report

What do you think?

Newbie

Written by Naga

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

Allu Arjun Statue: ఐకాన్ స్టార్ కు అరుదైన గౌరవం, మేడమ్ టుస్సాడ్స్‌లో అల్లు అర్జున్ విగ్రహం

Maruti Suzuki Cars Launch Soon: కొత్త మోడళ్లను పరిచయం చేయనున్న మారుతీ సుజుకి కార్లు