చీపురుపల్లి: వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రాథమిక హక్కులకు భంగం ఏర్పడిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా చీపురుపల్లిలో రిలే దీక్షలు కొనసాగాయి. దీనిలో భాగంగా ఆదివారం ఆయన టీడీపీ ఎస్సీ సెల్ నాయకుల దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు రోజురోజుకు మద్దతు పెరుగుతోందన్నారు. ఈ దీక్షల్లో ఎస్సీ సెల్ ప్రతినిధులు పెందుర్తి సింహాచలం, సబ్బి సోనియా, రేగాన రామారావు, బిల్లాన గోవింద, బవిరి గొల్లబాబు, ఎత్తుల సాంబ, పాండ్రంకి శ్రీను, చీడి రామకృష్ణ, గొంస భాస్కర్, పార్టీ మండల నాయకులు రౌతు కామునాయుడు, వెన్నె సన్యాసినాయుడు, పైల బలరాం, జనసేన నాయకులు రేగిడి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]