in

మండపేటలో ప్లాస్టిక్ బియ్యం కలకలం…

  • డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా : 

ప్రభుత్వం పంపిణీ చేసిన రేషన్ బియ్యం లో కొత్త రకం బియ్యం గింజలు కనిపించడం స్థానికుల్లో కలవరాన్ని రేకెత్తించింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మండపేట 25వ వార్డు కు చెందిన లంక గౌరీ కుమారి ఈ నెల 5న రేషన్ బియ్యం కొనుగోలు చేశారు. కాగా అన్నం వండెందుకు నీటిలో నానబెట్టగా ఎప్పుడూ లేని విధంగా కొన్ని గింజలు పైకి తేలిపోయాయి. సాధారణ బియ్యం గింజలకు విరుద్ధంగా లావుగా వుండటంతో అనుమానం వచ్చి నోటిలో వేసుకుని చూడగా అవి ఎంత మాత్రం నలగలేదు. రాడు తీసుకుని కొట్టినా పగలకపోవడంతో ఇవి ప్లాస్టిక్ బియ్యం ఏమో అని ఆందోళన కు గురయ్యారు. విషయం తెలుసుకున్న వీబీసీ న్యూస్ అక్కడకు వెళ్లి పరిశీలించగా ఎలాంటి రుచి లేకుండా తింటే సాగుతూ ఆశ్చర్యాన్ని కలిగించాయి. దాదాపు 5 గంటలు నీటిలో నానిన తరువాత ఇవి పిండి గా మారాయి. దీంతో మండపేట తహసీల్దార్ రాజ రాజేశ్వరరావు దృష్టికి విషయాన్ని తీసుకు వెళ్ళగా ఆయన తక్షణం ఎం ఎస్ వో కు సమస్యను వివరించి పరిష్కార చర్యలు తీసుకుంటానని తెలిపారు.  

విటమిన్లతో కూడిన పోర్టు పైడ్ రైస్ కేంద్ర ప్రభుత్వం సరఫరా దీనిపై ఎమ్మెస్ ఓ సుబ్బరాజు ను  వివరణ కోరగారేషన్ బియ్యం లో ప్రత్యేకంగా కనిపిస్తున్న బియ్యాన్ని చూసి ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, అవి ప్రజల ఆరోగ్యం నిమిత్తం కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసిన ప్రత్యేక బియ్యమని మండపేట ఎం.ఎస్.వో సుబ్బరాజు తెలిపారు. విటమిన్ ఎ, బి1, బి 12, కాల్షియం, ఐరన్, జింక్,పోలిక యాసిడ్ వంటి పోషకాలను ప్రత్యేకంగా వీటికి జతచేసి సాధారణ బియ్యం లో కలిపి ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. ఈ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని తప్పనిసరిగా అందరూ తినాలని, మరీ ముఖ్యంగా చిన్నారులు తినాలని తెలిపారు. ఇందులో ఎటువంటి అపోహలు అవసరం లేదని వివరణ ఇచ్చారు.


[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Kiran

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Trending Posts
Post Views
Popular Posts

వైసీపీ పాలనలో ప్రాథమిక హక్కులకు భంగం”

రేపట్నుంచి కొత్త పార్లమెంట్‌లో సమావేశాలు.. ఫలించనున్న కవిత పోరాటం!