గజపతినగరం: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ ఆదివారం చేపట్టిన పాదయాత్రను కొనసాగనీ యకుండా పోలీసులు అడ్డుకుని, ఆండ్ర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాబు అరెస్టు అక్రమమంటూ గజపతినగరం నుంచి విజయనగరం పైడితల్లి అమ్మ వారి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టేందుకు పార్టీ నాయకులు, కార్యకర్త లు సమాయత్తం అయ్యారు. ఇందుకు సంబంధించి అనుమతులకు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 7 గంటలకే శిబిరం వద్దకు ఏఎస్‌ఐ మూర్తితో పాటు పోలీస్ సిబ్బంది వచ్చి, శిబిరం నుంచి శివరామకృష్ణను బలవంతంగా పోలీసు జీపు ఎక్కించి మెంటాడ మండలం ఆండ్ర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అరెస్టులకు బయ పడేది లేదని చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లెంక చిన్నంనాయుడు, రుంకాన అరుణ, గోవింద తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]