విద్యార్థులు ఉన్నత విద్యావంతులు కావాలని పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. సోమవారం పెదపారుపూడి మండలం మోపర్రు గ్రామంలోని మండల పరిషత్ స్కూల్ ఆవరణలో నూతన సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరిగింది. పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రతిష్ట గావించారు. వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
[zombify_post]