ఎస్.కోట నియోజకవర్గ అభివృద్ధి సమీక్షా సమావేశం కలెక్టరేట్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు అధ్యక్షతన శనివారం నిర్వహించారు.ఎస్. కోట నియోజకవర్గ అభివృద్ధి సమీక్షా సమావేశం కలెక్టరేట్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. వ్యవసాయం, నీటి పారుదల, పారిశుద్ధ్యం, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, విద్యుత్తు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ- పంటకు సంబంధించి ఎక్కడా ఆలస్యం చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు సమయం రైతులకు ఇబ్బందులు లేకుండా వందశాతం సేకరించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఆదేశించారు.
జిల్లాలో ఎక్కువ వర్షాధార భూములు కావడంతో వరినాట్లు ఆలస్యమైన చోట ప్రత్యామ్నాయ చర్యలు సిద్దం చేయాలి. ఎరువుల కొరత లేకుండా చూడాలి. ఏ పీహెచ్సీ, సీహెచ్సీలో అయినా అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు అందించాలి. మా పరిధి కాదని అనడానికి వీల్లేదు.
వర్షాలు పడుతున్నందున డెంగీ, మలేరియా, సీజనల్ వ్యాధుల నివారణపై దృష్టి పెట్టాలి. గ్రామాల్లో స్ప్రే, బ్లీచింగ్, క్లోరినేషన్ విధిగా జరగాలి.

ఎస్ కోట నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలకు అవసరమైన భూమి కొనుగోలుకు కలెక్టర్కు రాయాలని గృహ నిర్మాణ సంస్థ అధికారులకు సూచించారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేతో కూర్చొని నివేదికను తయారు చేయాలి.
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులు జరుగుతాయన్న నమ్మకం కలిగించాలి. అలసత్వం చేయొద్దు. పనులకు ఒప్పందం చేసుకునేందుకు ముందుకొచ్చిన వారిని రెండు, మూడుసార్లు తిప్పొద్దు. అక్టోబరు నెలాఖరులోగా పనులు పూర్తి కావాలి.
ఉపాధి పథకంలో పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు అప్లోడ్ చేయాలి.మండలానికి రూ.60 లక్షల ప్రతిపాదనలు తీసుకోవాలి. ఎక్కువ ప్రతిపాదనలు వస్తే, కొన్ని శాఖ వద్ద ఉంచుకోవాలని డ్వామా పీడీ పరమేశ్వరికి సూచించారు.స్థలముంటే ఇల్లు
సొంత స్థలాలున్న వారు ఇళ్ల కోసం దరఖాస్తు చేసి ఉంటే, త్వరలోనే మంజూరవుతాయని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చెప్పారు. దీని కోసం అర్హుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి పడి, బిల్లులు రాకపోతే లబ్ధిదారులు జేకేసీ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇటువంటి వారికి బిల్లులు మంజూరవుతాయన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ వేచలపు చిన రామునాయుడు, వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి అనిత, జిల్లా ప్రణాళిక అధికారి బాలాజీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు.
[zombify_post]