-
సీఎం కేసీఆర్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం
-
బీఆర్ఎస్ సిద్ధాంతం అభివృద్ధి మాత్రమే
-
కాంగ్రెస్, బిజెపి లది అధికార యావ.. బీఆర్ఎస్ది అభివృద్ధి తోవ..
-
తిరుగులేని రాజకీయ శక్తి బీఆర్ఎస్
-
జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తు చీకటే..
-
సైనికుల తీరుగా రాష్ర్టాన్ని కాపాడుకోవాలి
-
– మంత్రి జగదీష్ రెడ్డి
సీఎం కేసీఆర్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని,75 ఏళ్ల కాంగ్రెస్ బిజేపి పాలన లో రాష్ట్రానికి, దేశానికి ఒరిగిందేమీ లేదని సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
సూర్యాపేటలోని సుమంగళి ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించిన మంత్రి రాబోయే ఎన్నికల్లో అనుసరించవలసిన విధానాలపై పెన్‌పహాడ్, ఆత్మకూర్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ బూత్ ఇన్ చార్జిలకు, నేతలకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. సుమంగళి జీవి ఫంక్షన్ హాల్లో జరిగిన వేరువేరు సమావేశాలలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్, బిజెపి లది అధికార యావ అయితే బీఆర్ఎస్ది అభివృద్ధి తోవ అన్నారు.బీఆర్ఎస్ సిద్ధాంతం అభివృద్ధి మాత్రమే అన్నారు.
75 ఏళ్ల పరాయి పాలనలో కానీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తొమ్మిది ఏళ్ల లోన్ చేసి ముఖ్యమంత్రి కేసీఅర్ దేశంలోనే తిరుగులేని రాజకీయ శక్తి గా బీఆర్ఎస్ పార్టీని నిలిపారన్నారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలుసైనికుల తీరుగా రాష్ర్టాన్ని కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు.

జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తు చీకటే అన్నారు.
సీఎం కేసీఆర్ అందిస్తున్న సుపరిపాలనతో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా దూసుకుపోతోందని, బిజేపి ,కాంగ్రెస్ లు రాష్ర్టానికి చేసిందేమీ లేదని, వాటి పాలన దేశానికి భారంగా మిగిలిందని దుయ్యబట్టారు. రైతుబంధు కోసం లక్షా రెండు వేల కోట్ల నిధులను వెచ్చించిన ప్రభుత్వం దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. 75 ఏళ్ల ప్రజాస్వామ్య భారతంలో చెప్పిన మేనిఫెస్టోను నూటికి నూరు శాతం అమలు చేసిన పార్టీ
బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్నారు. ఎన్నికల్లో చెప్పని కళ్యాణ లక్ష్మి, రైతు భీమ, అంటే ఎన్నో పథకాలను ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన నేత కేసిఆర్ అన్నారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రతి ఒక్క కార్యకర్త అలర్ట్ గా ఉండి ప్రభుత్వంగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రత్యర్ధి పార్టీల నేతలు చెప్పే అబద్ధాలు ఎప్పటికప్పుడు తిప్పి కొట్టి, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించబోయే హ్యాట్రిక్ విజయంలోపాలుపంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, విద్యావేత్త ఒంటెద్దు నరసింహారెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, ఎంపీపీలు నెమ్మాది బిక్షం, మార్ల స్వర్ణలత చంద్రారెడ్డి, జడ్పిటిసి మామిడి అనిత అంజయ్య, మండల పార్టీ అధ్యక్షులు దొంగరి యుగంధర్, తూడి నరసింహారావు, ప్రధాన కార్యదర్శులు వెన్న సీతారాంరెడ్డి బత్తుల ప్రసాద్, సింగిల్ విండో చైర్మన్లు నాతాల జానకి రామ్ రెడ్డి, కొనతం సత్యనారాయణరెడ్డి, రైతు సమన్వయ సమితి నేతలు, ఎంపీటీసీలో సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు ఉపసర్పంచ్ లో వార్డ్ మెంబర్లు, మండల యూత్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు
[zombify_post]