జిల్లాలో సోమవారం నుంచి గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఉత్సవాల నిర్వహణపై కలెక్టరేట్ సమీకృత భవనంలో శనివారం సాయంత్రం జిల్లా అదికారులు, మండపాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, నిర్వాహకులు పూజలతో పాటు నిమజ్జనోత్సవాన్ని శోభాయామానంగా నిర్వహించుకోవాలని సూచించారు. విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక శాఖలు సమన్వయం చేసుకోవాలన్నారు. నిర్మల్ పట్టణంలో రూట్ మ్యాప్ తయారు చేసి శోభాయాత్ర నిర్వహించే ప్రదేశాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. వినాయక సాగర్ వద్ద క్రేన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్, అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ ,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]