ఎస్. కోటలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాంప్రసాద్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు దీక్ష చేపట్టారు. నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మన బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడమే చంద్రబాబు చేసిన నేరమా అని లలితకుమారి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆకుల డిపో వద్ద పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యంలో దీక్ష జరిగింది. జామి మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయా శిబిరాల వద్ద సంతకాల సేకరణ చేపట్టారు.
[zombify_post]