దాతల కోసం ఎదురుచూస్తున్న బడే మియాకు, ఆర్ధిక సహాయం అందించిన: ముస్లిం చైతన్య వేదిక అధ్యక్షులు దుబాయ్ కరిముల్లా
ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల సెప్టెంబర్ 17 గురు న్యూస్ చెవిటికల్లు గ్రామనికి చెందిన షేక్ బడేమియ భాష్యం స్కూల్లో టీచర్ గా పని చేస్తూ ప్రమాదవశాస్తు విద్యుత్ షాక్ తో రెండు కాళ్లు, చేయి కోల్పోయి విగతాజీవిగా ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ పరిస్థితి పూట గడవడమే కష్టంగా చాలా ఇబ్బందిగా మారింది. తొలగించిన కాళ్లకు ఇన్ఫెక్షన్ రావడం వల్ల మళ్లీ సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థికంగా ఏమీ లేకా సాయం చేయండి అంటూ చెవిటికల్లు గ్రామ పెద్దలు ,సర్పంచ్ బుడ్డి సత్యనారాయణ ద్వారా దుబాయ్ కరీముల్లాను ఆశ్రయించిన బడేమియ తల్లి,తండ్రి.
వారి పరిస్థితిని గమనించిన దుబాయ్ కరిముల్లా దిగులు చెందకండి నేను మీ కుమారుడు లాంటివాడినే, నేనున్న. నాకు తోచిన నావల్ల అయ్యే సహాయం చేస్తాను అని ఆ కుటుంబానికి భరోసా కల్పించారు, ఆర్థిక సాయం అందించారు. భగవంతుడు నాకిచ్చిన,సంపాదనలో , కొంత ఆపదలో ఉన్న వారి కోసం ఖర్చు పెడతాను. మా తల్లిదండ్రులు నేర్పిన సమాజ సేవ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం అన్నారు. నాకున్న దాంట్లో కొంత సహాయం చేయడం దీనికి నా కుటుంబం సహకరించటం నా అదృష్టం అని దుబాయ్ కరీముల్లా అన్నారు. ఆర్థికంగా బడే మియాకు చాలా అవసరం వుంది. దాతలు ఎవరైనా ఉంటే సహకరించమని మీకున్న దాంట్లో ఎంతో కొంత, ఆర్థికచేయుత అందించమని,ఆపదలో ఉన్న బడేమియా కుటుంబాన్ని ఆర్థిక సహాయం చేయాలనుకున్నవారు…76609 95548 కాల్ చేయగలరు అని తెలిపారు .బడే మియా కు కనీసం సెల్ ఫోన్ కూడా లేని దారుణమైన పరిస్థితిని గమనించి దాతలు సహృదయంతో ఆదుకోవాలన్నారు.
పేదల పాలిట పెన్నిధి. బంధం, సంబంధం లేకుండా. కులమాతాలకతితంగా నిరుపేద కుటుంబాల ఆశాజ్యోతి గా చిగురించిన, ఆర్థిక దాత దుబాయ్ కరీముల్లా తనకున్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేయడం సమాజం హర్షించదగ్గ విషయం…
[zombify_post]