రాజకీయం కులం మత భేదాలుకు అతీతంగా సేవ చేస్తున్న: దుబాయ్ కరీముల్లా
ముస్లిం కుటుంబాలకు దుబాయ్ కరీముల్లా ఆర్థిక చేయూత
హర్షం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ ముస్లిం మైనార్టీలు
నందిగామ నియోజకవర్గంలో గత సంవత్సరం కాలంగా నియోజకవర్గంలో ముస్లిం కుటుంబాలకు ఎన్నో సందర్భాలలో ఆర్థికంగా, ప్రత్యేకంగా, పరోక్షంగా, రంజాన్ తోఫా మసీదులకు నిధులు, ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక చేయూత అందించిన ముస్లిం చైతన్య వేదిక అధ్యక్షులు దుబాయ్ కరిముల్లా మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వీరులపాడు మండలంలోని అల్లూరు గ్రామంలో ఇద్దరు ఆడపిల్లల పిల్లలకు ఆర్థిక చేయూత పాటు, అల్లూరు గ్రామంలో 36 మందికి ఆర్థిక సహాయం అందించారు. అల్లూరు గ్రామస్తులు, ముస్లిం కమిటీ సంఘం దుబాయ్ కరీముల్లా కు కృతజ్ఞతలు తెలిపారు.
నిత్యం ప్రజల కోసం వారికి అవసరమైనప్పుడు రాజకీయం కులం మత భేదాలుకు అతీతంగా సేవ చేస్తున్న దుబాయ్ కరీముల్లా కు స్థానికుల నుండి ప్రశంసలు అందుతున్నాయి.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోటేరు లక్ష్మి, రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ షహనాజ్, అల్లూరు సర్పంచ్ బిందేల రాణి, కొమ్మినేని సత్యం మరియు గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]