- మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం దారుణమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు అన్నారు. తనని కూడా అనేకసార్లు ఇబ్బందులు పెట్టి అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తనని హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు. చదువుకున్న ఐపీఎస్ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
[zombify_post]
