పొరపాటున పురుగులమందు తాగడంతో అస్వస్థతకు గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది.
బొండపల్లి: పొరపాటున పురుగులమందు తాగడంతో అస్వస్థతకు గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి బొండపల్లి ఏఎస్‌ఐ శ్రీనివాసరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఒంపల్లి గ్రామానికి చెందిన లండా అప్పలనాయుడు (47) ఈ నెల 2న కొండకిండాం గ్రామానికి సమీపంలోని కోళ్లఫారం వద్ద మంచినీటి బాటిల్ అనుకొని కోళ్లకు ఉపయోగించే పురుగుల మందు కలిపిన నీటిని తాగాడు. దీంతో అపస్మారక స్థితికి చేరుకున్న అప్పలనాయుడిని స్థానికులు, కుటుంబ సభ్యులు విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. మృతుని భార్య అప్పయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎఎస్‌ఐ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు.
[zombify_post]