in , , ,

ఓటు అవశ్యకతపై యువత అవగాహన కలిగి ఉండాలి

  • ఓటు వజ్రాయుధం..

  • అర్హత ఉన్న యువత ఓటరుగా నమోదు కావాలి.

  • ఓటు ఆవశ్యకత పై యువత అవగాహన కలిగి ఉండాలి.

  • –జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ యస్.వెంకట్రావు.

ఓటు వజ్రాయుధమని రాజ్యాంగంలో కల్పించిన  ప్రతి హక్కును స్వేచ్చాయుత వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ యస్. వెంకట్రావు అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్వీప్ కార్యక్రమంలో భాగంగా సమాచార శాఖ ఆధ్వర్యంలో ఓటు హక్కు ఆవశ్యకత పై  నిర్వహించిన  కార్యక్రమంలో  యస్.పి. రాజేంద్ర ప్రసాద్, అదనపు కలెక్టర్ ఏ. వెంకట్ రెడ్డి, అదనపు యస్.పి నాగేశ్వరరావు లతో కలసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జ్ఞాన కిరణాలను అందాలంటే రాజ్యాంగం తప్పక చదవాలని,  యువత వ్యక్తిత్వ వికాసంలో ఎంతో మార్పు చెందుతుందని అన్నారు. ప్రజాస్వామ్య భవిష్యత్ యువత చేతుల్లో ఉందని..  18 సంవత్సరాలు నిండిన  యువత  ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు.  బావి భారత సమాజానికి యువత ఒక మైలు రాయియని  స్వేచ్చాయుత వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. 

ఇప్పటికే జిల్లాలో అన్ని నియోజక వర్గాలలో ఓటరు అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఓటు ఆవశ్యకత పై ప్రజలలో చైతన్యం కల్పిస్తున్నామని అన్నారు. తదుపరి యస్.పి. మాట్లాడుతూ  ఓటు అత్యంత ప్రధానమైనదని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను  తప్పక వినియోగించుకోవాలని , ఎక్కువగా స్వీప్ కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. ఓటు ఆవశ్యకత పై నిర్వహించిన పాటలు, కవిత్వం,వ్యాసరచన, ఉపన్యాసం పోటీలలో  పాటల లో మొదట బహుమతి పొందిన యస్. సంధ్యారాణి,ద్వితీయ బహుమతి రేణుక, అలాగే తృతీయ బహుమతి ఉదయశ్రీ లకు…  కవిత్వం పోటీలో మొదటి బహుమతి కె.ప్రియా, ద్వితీయ బహుమతి యస్. సంధ్యారాణి, తృతీయ బహుమతి సి.హెచ్. శివాని లకు అదేవిదంగా వ్యాసరచనలో మొదటి బహుమతి తేజేస్విని ద్వితీయ బహుమతి కె. నాగలక్ష్మి అందుకున్నారని  తదుపరి  ప్రశంసా పత్రాలు అందచేసి ఎక్కువ సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులను ఈ సందర్బంగా అభినందించారు. స్థానిక భవిత కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి దాదాపు 100 మంది కి  పైగా విద్యార్థులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో డి.పి.ఆర్.ఓ రమేష్ కుమార్, డిటిడిఓ శంకర్,డిఐఈ ఓ కృష్ణయ్య,డిఎస్పి లు నాగభూషణం,రవి,కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

రాజమండ్రి నుంచి ఢిల్లీ బయలుదేరిన నారా లోకేష్

పెద్దతుంబళం పోలీసుస్టేషన్ ను తనిఖీ చేసిన….జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారు.