in ,

స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొనాలని మేయర్ పిలుపు

  1. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టే ఆఫ్ అర్బన్ మెంట్  ఆద్వర్యంలో స్వచ్చత సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇండియా స్వచ్చత లీగ్ 20 కార్యక్రమాన్ని ఈ నెల 17 వ తేదీన నిర్వహించేందుకు పిలుపు నిచ్చింది.   రాష్ట్రంలో నగరపాలక సంస్థ లు, మున్సిపాలిటీలు, పురపాలక సంస్థల్లో బీచ్ లు, జలాశయాలు, టెంపుల్స్, పార్కులు, బస్టాండ్ లాంటి తదితర ప్రాంతాల్లో చెత్తను తొలగించే కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ… ఈ రోజు కరీంనగర్ భగత్ నగర్ మేయర్ క్యాంపు కార్యాలయంలో మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రత్యేక పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్స్, కాలేజీల విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులను, వివిధ కుల సంఘాలు, స్వచ్చంద సంస్థలు, మహిళ సంఘాలు బాగస్వాములై నగరంలో స్వచ్చత కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ స్వామీ, సానిటేషన్ సూపర్ వైజర్ రాజమనోహర్, బీఆర్ఎస్ కార్యకర్తలు కన్నం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Rajendra

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Trending Posts

ఇళ్లులేని నిరుపేదలందరికి గృహలక్ష్మి

బసవన్నలకు ప్రత్యేక పూజలు- పవార్ రామారావు పటేల్