టిడిపి-జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించడం శుభ పరిణామమని వైసిపి ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. జనసేన ఎరుపు, టిడిపి పసుపు కలిస్తే కాషాయం రంగు వస్తుందని.. దానికి బిజెపి కూడా సమ్మతిస్తుందని తాను భావిస్తున్నానని చెప్పారు. బిజెపి పెద్దల మనసులో ఏముందో పవన్‌కు తెలుసు కాబట్టే పొత్తు గురించి మాట్లాడారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ పార్టీల కలయిక.. 160 సీట్లు గెలిచి ప్రభంజనం సృష్టించడం ఖాయమని రఘురామ జోస్యం చెప్పారు.
[zombify_post]